తన తప్పును కప్పిపుచ్చేందుకే ట్రంప్ భారత్ పై ఫైర్..??

వాస్తవం ప్రతినిధి: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నిర్మూలించడంలో మలేరియా వ్యాధిని అరికట్టే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ టాబ్లెట్ల వాడకం సత్ఫలితాలు చూపిస్తున్నాయని భావిస్తున్న తరుణంలో తమకు వాటిని ఎగుమతి చేయాల్సిందిగా ట్రంప్‌ భారత్‌ను కోరిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే భార‌త్ నుంచి అమెరికా హైడ్రాక్సీక్లోరోక్వీన్ మెడిసిన్‌ను త‌మ‌కు పంపించాల్సిందిగా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ భార‌త ప్ర‌ధాని మోదీతో ఫోన్ ద్వారా మాట్లాడిన స‌మ‌యంలో కోరారు. అయితే, ఆ త‌రువాతి రోజు నుంచే భార‌త్ ఈ మెడిసిన్ స‌హా క‌రోనా చికిత్స‌లో స‌హాయ‌ప‌డే ఇత‌ర మందుల ఎగుమ‌తిపై నిషేధం విధించింది. కోవిడ్‌-19 అమెరికాపై తీవ్ర ప్రభావం చూపుతున్న తరుణంలో ట్రంప్‌ శ్వేతసౌధంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఎగుమతులను భారత్‌ నిషేధించిన విషయం గురించి విలేకరులు ట్రంప్‌ ముందు ప్రస్తావించారు. ఇందుకు బదులుగా.. చాలా ఏళ్లుగా భారత్‌ వాణిజ్యపరంగా అమెరికా వల్ల అనేక ప్రయోజనాలు పొందింది. అలాంటి మాకు కూడా భారత్‌ ఆ మాత్రలు పంపకూడదు అనుకుంటే..అదే గనుక ఆయన నిర్ణయం అయితే.. మరేం పర్లేదు. ప్రతీకారం తీర్చుకోకుండా ఎలా ఉంటాం. కచ్చితంగా అందుకు కౌంటర్‌ ఇస్తాం” అని ట్రంప్‌ సమాధానమిచ్చారు. అంతే ఒక్కసారిగా ట్రంప్ పై పలువురు మండిపడుతున్నారు. ట్రంప్ తీరును తప్పుబడుతున్నారు. ఒక్క బాధ్యత గల అగ్రరాజ్య దేశాధినేత ఇలా మరొక దేశాన్ని బెదరించడం సరికాదని అని పలువురు విమర్శిస్తున్నారు.

కరోనావైరస్ సంక్షోభం వల్ల అమెరికాకు ట్రిలియన్ డాలర్లు ఖర్చవుతాయని మరియు మిలియన్ల మంది అమెరికన్లను అనారోగ్యం లేదా మరణానికి గురిచేయవచ్చని అధ్యక్షుడు ట్రంప్ యొక్క వాణిజ్య సలహాదారుడు పీటర్ నవారో జనవరి చివరిలో హెచ్చరించారు. అయినప్పటికి ట్రంప్ కరోనాని తెలిగ్గా తీసుకున్నారు. అమెరికాలో కేవలం 11, 12 కరోనా కేసులు మటుకే ఉన్నాయని, పెద్ద ప్రమాదం ఏమి లేదని, ఏప్రిల్ కల్ల కరోనాను కట్టడి చెయ్యోచ్చు అని చెప్పారు. మరి ఇప్పుడు ఏప్రిల్ నెల జరుగుతుంది.. అమెరికా పరిస్ధితి గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. కరోనా దెబ్బకి అమెరికా అతలాకుతలం అవుతుంది. ట్రంప్ జనవరిలోనే కరోనా కట్టడి పై దృష్టి సారించుంటే ఇప్పుడు అమెరికాకి ఈ పరిస్ధితులు వచ్చుండేవి కావు అని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ తన చేతకాని తనాని, తన అసమర్ధతని, తను చేసిన తప్పులను సరిదిద్దుకోకుండా ఇలా మరో దేశాని బెదిరించడం సరైన పద్దతి కాదని ప్రధానంగా వినిపిస్తున్న మాట.