లాక్‌డౌన్‌ కష్టాలు: ఎక్క‌డివాళ్లు అక్క‌డే..ఇండోనేషియాలో ఇండియన్స్ తిప్పలు!!

వాస్తవం ప్రతినిధి: క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌పంచ దేశాలు స్తంభించిపోయాయి. ఈ క్ర‌మంలోనే ఇండోనేషియాలోని బాలిలో కూడా 80 మంది భార‌తీయులు చిక్కుబ‌డిపోయారు. వారిలో హైదరాబాద్‌కు చెందిన వారు ఐదుగురు, విజయవాడకు చెందిన వారు ఐదుగురు, ఇద్దరు తిరుపతి వాసులు ఉన్నట్లు తెలిసింది. విహార యాత్ర‌ల కోసం ఇండోనేషియా వెళ్లిన వారంతా లాక్‌డౌన్‌ కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించడంతో బాలిలో ఉండిపోయారు. ప్రస్తుతం బాలిలోని ఒక‌ హోటల్‌లో ఆశ్రయం పొందుతున్నామని, డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వదేశం చేరుకునేందుకు ప్రభుత్వాలు స‌హ‌క‌రించాల‌ని కోరుతున్నారు.