ఏ దేశంలోనూ జరగని స్థాయిలో.. అమెరికాలో ఏకంగా 16 లక్షలమందికి..

వాస్తవం ప్రతినిధి: కరోనా వైరస్ దెబ్బకు అమెరికా అల్లకల్లోలమైపోయింది. ఇప్పటి వరకు కరోనాతో అమెరికా లో 12, 935మంది మరణించారు. తాజాగా.. నలుగురు తెలుగువారూ కరోనాతో మృతి చెందినట్లు సమాచారం. సిలికాన్‌ వ్యాలీలో ఉంటున్న ఓ తెలుగు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ లండన్‌ వెళ్లి కరోనాతో వచ్చారు. అది ఆయన తల్లికి సోకడంతో ఆమె మృతి చెందింది. న్యూజెర్సీలో ఓ కుటుంబానికి చెందిన (కర్ణాటక) తండ్రి, కొడుకు కరోనా బారిన పడి చనిపోవడంతో ఇంట్లో ఉన్న అత్తా కోడలు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారు. కరోనా భయంతో వారిని పరామర్శించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం అక్కడి భయానక పరిస్థితికి అద్దం పడుతోంది. అమెరికాలో సీనియర్‌ జర్నలిస్టుగా పని చేస్తున్న బ్రహ్మ కూచిబొట్ల రెండు రోజుల క్రితం న్యూయార్క్‌ ఆస్పత్రిలో చనిపోయారు. ఏ దేశంలోనూ జరగని స్థాయిలో ఏకంగా 16 లక్షలమందికిపైగా కరోనా పరీక్షలు అమెరికాలోనే జరిగాయి. మరీ ముఖ్యంగా న్యూయార్క్‌, న్యూజెర్సీ రాష్ట్రాలల్లో ఉంటున్న భారత సంతతికి చెందిన అమెరికా పౌరుల్లో పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టు సమాచారం.