బ్రిటన్‌లో కరోనా కాటుకు ఇండియన్ డాక్టర్ మృతి..!!

వాస్తవం ప్రతినిధి: కరోనా మరణాలు తీవ్రత ప్రపంచాన్ని భయపెడుతోంది. కరోనా మహమ్మారి మారణహోమానికి పలువురు భారతీయ సంతతికి చెందిన వారు కూడా బలవుతున్నారు. తాజాగా బ్రిటన్‌లో హృద్రోగ నిపుణుడైన భారత సంతతి వైద్యుడు జితేందర్‌ కుమార్‌(58) కరోనా చికిత్స పొందుతూ మరణించారు. ఫ్లూ లక్షణాలు కనిపించడంతో కార్డీఫ్‌ ఆస్పత్రిలో చేరిన ఆయన, చికిత్స అందిస్తుండగానే మంగళవారం మరణించారు. ఇదే ఆస్పత్రిలో పక్షం రోజుల్లో పలువురు వైద్య సిబ్బంది మృత్యువాతపడ్డారు.