లాక్ డౌన్ ఎఫక్ట్: ఇంటి ద‌గ్గ‌రే ప్రాక్టీస్..!!

వాస్తవం ప్రతినిధి: క‌రోనా మ‌హ‌మ్మారిని త‌ర‌మికొట్టేందుకు దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ కొన‌సాగిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే బెంగాల్ ఓపెన్ గోల్ఫ్ చాంపియన్ షిప్ తొలి టైటిల్ ను గెలుచుకున్న గోల్ఫ్ క్రీడాకారుడు ఆదిల్ బేడి.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల నేప‌థ్యంలో చండీగ‌ఢ్ లోని ఇంటి ద‌గ్గ‌రే త‌న‌ ప్రాక్టీస్ కొన‌సాగిస్తున్నాడు. గార్డెన్, డ్రాయింగ్ రూంలో ప్రాక్టీస్ చేస్తున్నాని, గోల్ఫ్ బాల్ ఎత్తును, వెళ్తున్న మార్గాన్ని, స్వింగ్స్ వేగాన్ని విశ్లేషించేందుకు ట్రాక్ మన్ (గోల్ఫ్ రాడార్‌), సెన్సార్ లెవల్ ప్లేట్ల‌ను ఉప‌యోగిస్తున్నట్లు గోల్ఫ‌ర్ ఆదిల్ బేడి తెలిపాడు.