భారత్‌ ఎంత బలమైందో అందరికి తెలుసు..!!

వాస్తవం ప్రతినిధి: ఐపీఎల్‌ కాంట్రాక్టుల కోసం ఆస్ట్రేలియా ఆటగాళ్లు.. కోహ్లీసేనకు భయపడుతున్నారంటూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ క్లార్క్‌ ఓ బాంబు పేల్చాడు. గత కొన్నేండ్లుగా చూస్తే భారత కెప్టెన్‌ కోహ్లీతో పాటు జట్టు సభ్యులను స్లెడ్జింగ్‌ చేసే విషయంలో కంగారూలు వెనుకంజ వేస్తున్నారని, క్రికెట్‌ ఆర్థికపరమైన విషయాల్లో భారత్‌ ఎంత బలమైందో అందరికి తెలుసని, అందుకే.. ఆస్ట్రేలియాతో పాటు మిగతా జట్లు కూడా టీమ్‌ఇండియా అంటే భయపడ్డాయి అని, ఎందుకంటే ఐపీఎల్‌లో ఆడాలంటే వారితో మంచిగా ఉండాలనేది అందరికి అర్థమైంది అని క్లార్క్‌ అన్నాడు.