తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో కోర్టు లాక్‌డౌన్ ను ఏప్రిల్ 30 వరకు పొడిగించి, వేస‌వి కోర్టు సెలవులను రద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. న్యాయమూర్తులు ప్రస్తుత పరిస్థితిపై బార్ లీడర్లు, వైద్య నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. అనంతరం ఏప్రిల్ 30 వరకు కోర్టుల లాక్‌డౌన్ పొడిగించి, ఈ ఏడాది వేసవి సెలవులను రద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. హైకోర్టుతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కోర్టులు ఈ ఏడాది మే 1 నుంచి జూన్ 5 వరకు చేస్తాయి.