ప్రతి సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి వాయుపుత్రుని జీవితం స్ఫూర్తినిస్తుంది: మోదీ

వాస్తవం ప్రతినిధి: ‘ప్రతి సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి వాయు పుత్రుడైన హనుమంతుడి జీవితం స్ఫూర్తినిస్తుంది’ అంటూ హనుమాన్‌ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచం మొత్తం కరోనా కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతోంది. దాదాపు అన్ని దేశాలు లాక్‌డౌన్‌ కావడంతో.. ఆర్థిక స్థితిగతులు తారుమారవుతున్నాయి. వీటిని ఉద్దేశించి మోదీ ట్వీట్ చేశారు.
‘భక్తిభావం, బలం, అకింతభావం, క్రమశిక్షణకు వాయుపుత్రుని జీవితం నిదర్శనం. ప్రతి సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఆయన జీవితం స్ఫూర్తినిస్తుంది’ అని ఈ క్లిష్ట సమయంలో ప్రజలకు ధైర్యాన్ని నూరిపోసేలా ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు.
ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో పౌర్ణమి రోజున హిందువులు హనుమాన్‌ జయంతిని జరుపుకొంటారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఆ పండుగను జరుపుకోవాలని ప్రభుత్వాలు సూచించాయి.