ఏపీ లో లాక్ డౌన్ మరింత కఠినతరం..ఆక్టోపస్ బృందాలు రంగంలోకి

వాస్తవం ప్రతినిధి: ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న కరోనా ఇప్పుడు దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఓ వైపు సీరియస్ గా లాక్ డౌన్ పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో విజ్ఞప్తులు చేస్తున్నా.. కొంత మంది నిర్లక్ష్య దోరణి వల్ల కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ వారం రోజుల్లో కేసుల సంఖ్యం మరింత పెరిగిపోతున్నాయి. అయితే దేశ వ్యాప్తంగా ఈ కేసులు ఎక్కువగా ఢిల్లీలో మర్కజ్ సమావేశాలకు వెళ్లొచ్చిన వారి ద్వారా సంక్రమిస్తున్న విషయం తెలిసిందే.

ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం కోవిడ్-19పై వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం నేపథ్యంలో ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ ను మరింత కఠినతరం చేయాలనీ భావించి అత్యంత క్లిష్ట సమయాలలో మాత్రమే రంగ ప్రవేశం చేసే ఆక్టోపస్ బృందాన్ని గుంటూరు కు రప్పించినట్టు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.