మోడీకి సూచనలు ఇచ్చిన మాజీ ఆర్.బి.ఐ గవర్నర్..!!

వాస్తవం ప్రతినిధి: మాజీ ఆర్.బి.ఐ గవర్నర్ రఘురామ రాజన్ ప్రధాని మోడీ కొన్ని సూచనలు ఇచ్చారు. కరోనా వైరస్ అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న లాక్‌డౌన్‌ విషయంలో కొన్ని సూచనలు ప్రతిపాదించారు. ప్రాణాంతకమైన ఈ కరోనా వైరస్ ని అరికట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం చాలా కృషి చేస్తోంది అంటూ అభినందించారు. కాగా లాక్‌డౌన్‌ ఇంకా కొనసాగితే భారత్ లో ఆర్థిక కష్టాలు భయంకరంగా భవిష్యత్తులో ఉంటాయని రఘురాం రాజన్ అన్నారు. ఈ నేపథ్యంలో వైరస్ ప్రభావం తక్కువగా ఉన్నచోట లాక్‌డౌన్‌ ని ఎత్తి వేయాలని మోడీ ని కోరారు. అంతేకాకుండా ఇటువంటి టైం లో ప్రభుత్వం ప్రైవేటు రంగ సంస్థలను ప్రోత్సహించాలని సూచించారు. అదేవిధంగా పేద మరియు దిగువ మధ్య తరగతి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సూచించారు. దశలవారీగా లాక్‌డౌన్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్లాలని ప్రతిపాదించారు. అంతే కాకుండా సామాజిక దూరం అదే విధంగా వ్యక్తిగత పరిశుభ్రత వంటి విషయాలలో కేంద్ర ప్రభుత్వం…ప్రజలకు అవగాహన కల్పించే విధంగా రాష్ట్రాలకు కొన్ని ప్రతిపాదనలు పంపించాలని మాజీ ఆర్.బి.ఐ గవర్నర్ రఘురాం రాజన్ చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఏప్రిల్ 14 తర్వాత ఇంకా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ని కొనసాగిస్తే భారత ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడినట్లే అని అంటున్నారు రాజన్.