నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి ఛాన్స్ దొరకడంతో జగన్ సర్కార్ పై కొత్త స్కెచ్..!!

వాస్తవం ప్రతినిధి: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన సందర్భంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని అనేక ఇబ్బందులకు గురి చేసింది ఏపీ ప్రభుత్వం. అదే టైములో ఆ విషయం న్యాయస్థానాల దాకా వెళ్లడంతో…ఎన్నికల కోడ్ ఎత్తివేస్తూ ఎన్నికలను వాయిదా వేయడం తో పాటు ఎవరు ప్రచారం చేయకూడదని తీర్పు ఇవ్వడం జరిగింది.

ఇటువంటి టైములో ఇటీవల జగన్ సర్కార్ కరోనా వైరస్ విపత్తు నేపథ్యంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రజలకు ప్రతి కుటుంబానికి వెయ్యి రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ సందర్భంలో కొంతమంది అత్యుత్సాహం కలిగిన వైసీపీ నేతలు…ఈ వెయ్యి రూపాయలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓటు వేయటానికి ఇస్తున్నట్లు ప్రకటించడం జరిగింది.

అదే టైంలో వాటికి సంబంధించిన ఫోటోలు మరియు సోషల్ మీడియాలో రావడం జరిగింది. దీంతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి ఛాన్స్ దొరకడంతో జగన్ సర్కార్ పై సరి కొత్త స్కెచ్ వేశారు.

అదేమిటంటే నిబంధనలను ఉల్లంఘించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారాన్ని చేసిన వైసీపీ నేతల లిస్టు కావాలంటూ అన్ని జిల్లాల కలెక్టర్లకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇటీవల ఆదేశించారు. దీంతో ఈ పరిణామంతో జగన్ సర్కార్ కి చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.