ఆ విషయం లో కేసీఆర్ బాటలోనే అంటున్న ఉద్ధవ్ థాకరే

వాస్తవం ప్రతినిధి: కరోనా కట్టడికి ప్రజలు మరికొంత కాలం ఇంటి వద్ద ఉండటం ఒక్కటే పరిష్కారమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. అంతేకాదు లాక్‌డౌన్ మరికొంతకాలం కొనసాగించడం వల్ల జనం ఇంటిపట్టునే ఉంటారని తద్వారా కరోనాను కట్టడి చేయవచ్చని కేసీఆర్ సూచించారు.

లాక్‌డౌన్ కొనసాగింపుపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదవడంతో పాటు మరణాలూ పెద్ద సంఖ్యలో ఉండటంతో ఉద్ధవ్ లాక్‌డౌన్ కొనసాగింపు కోరుకుంటున్నారు. మహారాష్ట్రలో ఇప్పటివరకూ 891 కేసులు నమోదయ్యాయి. 45 మంది చనిపోయారు. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో తాము లాక్‌డౌన్ కొనసాగింపు కోరుకుంటున్నామని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపె చెప్పారు.