ఆ రాష్ట్రంలో ఏప్రిల్ 14 తో లాక్ డౌన్ నిలిపివేత

వాస్తవం ప్రతినిధి: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతం అవుతుండడం తో ఏప్రిల్ 14 తో లాక్ డౌన్ ఎత్తివేస్తారా లేదా అనే అనుమానం ప్రజలందరిలో ఉంది. ఇంకొన్ని రోజులపాటు లాక్ డౌన్ నిర్వహిస్తే మంచిదనే నిర్ణయాన్ని కొన్ని రాష్ట్రాలు చెపుతుంటే..మేఘాలయ మాత్రం ఏప్రిల్ 14 తో లాక్ డౌన్ ఎత్తివేస్తున్నట్లు చెపుతుంది.

ఏప్రిల్ 15 నుండి లాక్ డౌన్ నిలిపివేస్తున్నామని ఇకపై అన్ని కార్యాలయాలు యథాతథంగా పనిచేయవచ్చని ప్రకటించింది. ప్రైవేట్ వ్యాపారులకు మాత్రం కొన్ని నిబంధనలు ఉంటాయని తెలిపింది. పాఠశాలలకు కూడా ఏప్రిల్ 30 వరకు సెలవులు ప్రకటించింది. ఇప్పటివరకు మేఘాలయాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోయేసరికి ఆ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేయాలని భావిస్తుంది.