కేంద్రం,యుపి ప్రభుత్వాలు చేయలేని పని కరోనా చేసి చూపించింది

వాస్తవం ప్రతినిధి: గతంలో యమునానది కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, యుపి కాలుష్య నియంత్రణ మండలి ఎంతగానో కృషి చేశాయి. అయినా ఫలితం లేకపోయిందనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఇప్పుడు పరిశ్రమల మూసివేత, రవాణా వ్యవస్థ నిలిచి పోవడంతో ఆ ప్రభావం యమునానదిపై పడింది. ఫలితంగా యమునా స్వచ్ఛంగా మారిపోయింది. యమునా నది నీరు కేవలం 12 రోజుల్లో స్వచ్ఛంగా మారిపోయింది. ఇప్పుడు అందులో మన ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో యమునా నదిని దేశంలోనే అత్యంత మురికి నదిగా భావించేవారు. యమునా నది వంతెనపై నిలుచున్నప్పుడు అందులోని నీరు మురికిగా, తెల్లటి నురుగు రూపంలో కనిపించేది. అయితే ఇప్పుడు ఆ నీరు చాలా స్వచ్ఛంగా మారిపోయింది.