వాస్తవం ప్రతినిధి: మానవ జాతికి సంక్షోభంగా మారిన కరోనా వైరస్.. రోజురోజుకీ తన ప్రాబల్యాన్ని పెంచుకుంటోంది. ఎన్ని నివారణ చర్యలు చేపట్టిన ‘కొవిడ్-19’ ప్రాణాలు తీస్తూనే ఉంది. విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా కరోనాకు బలి అవుతున్నారు. తాజాగా కెనడాలో కరోనా మహమ్మారి ఓ తెలంగాణ వైద్యుడిని బలితీసుకుంది. వరంగల్‌కు చెందిన అబు అజ్హర్ (75) కాకతీయ మెడికల్ కాలేజీలో వైద్యవిద్యను అభ్యసించి.. కెనడా వెళ్లి అక్కడే వైద్యుడిగా స్థిరపడ్డారు. 30ఏళ్లుగా పల్మనాలజిస్టుగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల ఆయనకు కరోనా వైరస్ సోకడంతో హస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. ఆయనను 10 రోజులపాటు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆదివారం చికిత్స పొందుతూ చనిపోయారు.