ఇక పై నా దృష్టంతా ప్రాక్టీస్‌పైనే..!!

వాస్తవం ప్రతినిధి: తనలో సత్తా తగ్గిందని ప్రజలు భావిస్తున్నా.. ఇలాంటి వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోనని అంటున్నాడు భారత స్టార్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌. ఎవరు ఏమనుకున్నా.. వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటానని ఆశాభావం వ్యక్తం చేశాడు. అందుకోసం ప్రాక్టీస్‌ ముమ్మరం చేస్తానని పేర్కొన్నాడు. ఇక పై నా దృష్టంతా ప్రాక్టీస్‌పైనే. ఎక్కడికి వెళ్లాలనుకోవడం లేదు. టోక్యో ఒలింపిక్స్‌కు పూర్తిస్థాయిలో సిద్దమయ్యేందుకు అవసరమైనంత సమయం ఉంది. ప్రస్తుతానికి రెండు రోజులకోసారి సాధన చేస్తున్నా’ అని సుశీల్‌ అన్నాడు.