దొంగతనాలు-దోపిడీలు..కిడ్నాప్ – హత్య కేసులు.. ఏమీ లేవు..క్రైం రేట్ నిల్!!

వాస్తవం ప్రతినిధి: గతంలో చాలావరకు కుటుంబం కలహాలు – దొంగతనాలు – కిడ్నాప్ – హత్య కేసులు భారీగా ఉండేవి. అయితే రెండు వారాల్లో అవి కనిపించడం లేదు. కరోనా కారణంగా వాటి సంఖ్య గణనీయంగా తగ్గిందని ఏపీ పోలీస్ అధికారులు చెబుతున్నారు.

ఆ రిపోర్టు ప్రకారం సుమారు 33 నుంచి 55 శాతం మేరకు నేరాల సంఖ్య తగ్గిందని పోలీసు అధికార వర్గాలు చెబుతున్నాయి. లాక్డౌన్ అమలుతోపాటు పోలీసుల గస్తీతో పాటు నిరంతర నిఘా ఉండడం..బయటకు వస్తే ఎక్కడ కరోనా వస్తుందేమో అన్న భయంతో ఎవరి ఇంటికి వారు పరిమితం కావడంతో నేరాల సంఖ్య తగ్గడానికి కారణమని తెలుస్తోంది.

వీటితో పాటు రోడ్డు ప్రమాదాలు కూడా బాగా తగ్గాయి. గతంలో రోజు రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రజలు మృతి చెందుతుడడంతో పాటు తీవ్రంగా గాయపడేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే వాహనాల రాకపోకలు నిషేధం విధించారు కదా.