‘మానవతా కోణంలో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాం’: కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ

వాస్తవం ప్రతినిధి: కరోనా వైరస్ ను నివారించేందుకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ సరఫరా చేయాలని రెండు రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. భారత్‌ను కోరిన విషయం విదితమే. బ్రెజిల్‌, స్పెయిన్‌తో సహా కరోనా ప్రభావవంతంగా ఉన్న దేశాలు ఈ మెడిసిన్స్‌ను సరఫరా చేయాలని కోరాయి.ఈ నేపధ్యంలోనే ప్రపంచ దేశాల డిమాండ్‌ మేరకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ అత్యవసరంగా అవసరమున్న దేశాలకు ఎగుమతి చేసేందుకు భారత్‌ సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.భారత్ అవసరాలకు సరిపడ సహా మరో 25 శాతం నిల్వ చేసుకుని మిగిలినది ఎగుమతి చేసేందుకు అనుకూలంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.

మానవతా కోణంలో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పారాసిటమాల్‌, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను తగిన పరిమాణంలో పొరుగు దేశాలకు సరఫరా చేస్తామని చెప్పింది. ఈ మెడిసిన్స్‌ను అత్యవసరంగా అవసరమున్న దేశాలకు కూడా ఎగుమతి చేస్తామని ప్రకటించింది.