కరోనా కట్టడికై సరికొత్త ప్లాన్ ప్రకటించిన ఢిల్లీ సర్కార్

వాస్తవం ప్రతినిధి: కరోనా వ్యాప్తి వేగంగా ఉన్న రాష్ట్రాల్లో ఢిల్లీ ఒకటి. మర్కజ్ ప్రార్థనాల కారణంగా ఇతర రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ ఈ కేసుల సంఖ్య బాగా పెరిగింది. ఇప్పటికే 525 కరోనా కేసులు నమోదైన ఢిల్లీలో… ఈ మహమ్మారి కట్టడికి కీలక నిర్ణయం తీసుకుంది కేజ్రీవాల్ ప్రభుత్వం. ఈ మహమ్మారిని తరిమి కొట్టేందుకు సరికొత్ ప్లాన్‌ను ప్రకటించారు. ఇందుకోసం 5టీ ప్లాన్‌ను రూపొందించారు.

టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీట్‌మెంట్‌, టీమ్‌ వర్క్‌, ట్రాకింగ్‌ అండ్‌ మానిటరింగ్‌ అనేదే 5టీ అని సీఎం కేజ్రీవాల్‌ వివరించారు. కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా 12 వేల హోటల్‌ గదులను అద్దెకు తీసుకుని క్యారంటైన్‌ కేంద్రాలుగా మార్చబోతున్నామని కేజ్రీవాల్ తెలిపారు. 8 వేల మందికి సరిపోయేలా అత్యవసర చికిత్స అందించే ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు.

ఇక కేజ్రీవాల్ 5టీలో భాగంగా రాష్ట్రంలోని ఐదు లక్షల మందికి ర్యాండమ్‌గా పరీక్షలు నిర్వహిస్తారు. దేశరాజధానిలో కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులను త్వరగా గుర్తించడానికి ప్రయత్నాలు చేస్తారు. పాజిటివ్ కేసులకు పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తారు.