సమయం లేదు..నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోండి : చంద్రబాబు

వాస్తవం ప్రతినిధి: రాష్ట్రంలో రోజు రోజుకూ విజృంభిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. చరిత్రలో ఎప్పుడూ చూడని సమస్య ఇదని.. ప్రభుత్వం నిపుణుల సూచనలు తీసుకుని అమలు చేయాలన్నారు. రాజకీయాలకతీతంగా ప్రభుత్వం అందరినీ కలుపుకెళ్లాలన్నారు. సరైన సమయంలో క్వారంటైన్‌ చేసి ఉంటే కేసులు పెరిగి ఉండేవి కాదని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం వాస్తవాలను దాచిపెట్టడం సరికాదన్నారు.

ట్రంప్‌ ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో ముందుకెళ్లడం వల్ల అమెరికాకు నష్టం వాటిల్లిందన్నారు. ట్రంప్‌ అసమర్థత చూసైనా జగన్‌ కళ్లు తెరవాలన్నారు. రైతు బీమా ఉండుంటే చాలా మందికి ఉపయోగపడేదని.. అన్న క్యాంటీన్లతో పేదలకు ఆకలి బాధ తీరేదన్నారు.