వైద్యుల భద్రతపై తెలంగాణ సర్కార్ సరికొత్త డెసిషన్..!!

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కరోనా వైరస్ కట్టడి చేయడంలో వైద్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ పేషెంట్ల ద్వారా గాంధీ ఆస్పత్రిలోకి వచ్చిన బంధువులు ఇటీవల కొంతమంది వైద్య సిబ్బంది పై దాడి చేసిన ఘటన అందరికీ తెలిసినదే. అంతేకాకుండా కరోనా వైరస్ వివరాలు అడిగి తెలుసుకోవడానికి అదేవిధంగా హెల్త్ చెకప్ చేయడానికి వెళుతున్న ఆశా వర్కర్ల పై ఏఎన్ఎం నర్సులపై తెలంగాణలో ఇటీవల కొన్ని దాడులు జరగటం మనం అందరం చూశాం. ఈ నేపథ్యంలో వైద్యుల భద్రతపై తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. ఈ మేరకు తెలంగాణ డిజిపి ట్విట్టర్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పనిచేస్తున్న డాక్టర్లు, హెల్త్ వర్కర్లు, పారా మెడికల్ సిబ్బంది భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఇదే టైములో రాష్ట్ర వ్యాప్తంగా హాస్పిటల్ లో పనిచేస్తున్న వైద్యుల రక్షణ కోసం ఆ ప్రాంతంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే పోలీసులు మరియు వైద్యులు కలిపి ఒక వాట్సాప్ గ్రూపు లో ఉండే విధంగా…రాష్ట్రవ్యాప్తంగా ఈ విధంగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ గ్రూపుల ద్వారా ఎప్పటికప్పుడు పోలీసు అధికారులు డాక్టర్ లతో సంప్రదింపులు జరుపుతూ వారి భద్రతకు కావాల్సిన చర్యలు చేపడతారని డీ.జి.పి వివరించారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలోని వైద్యులు, పోలీసులతో కలిపి ప్రత్యేకంగా మెడికల్ వాట్సప్ గ్రూప్‌ను ఏర్పాటు కాగా.. నగర పరిధిలోని డాక్టర్లు, జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు, హెల్త్ వర్కర్లు, ఆశా వర్కర్లను కలిపి నోడల్ వాట్సప్ గ్రూపును మొదలుపెట్టామని తెలిపారు.