ప్రధాని పిలుపు మేరకు ప్రగతి భవన్‌లో దీప యజ్ఞంలో పాల్గొననున్న కేసీఆర్

వాస్తవం ప్రతినిధి: తెలంగాణలో కరోనా కేసులు, నివారణ చర్యలు, రాష్ట్రంలో పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్ష సమావేశానికి ప్రగతి భవన్ వేదిక కానుంది. సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం జరగనుంది.

కాగా.. ప్రధాని పిలుపు మేరకు ప్రగతి భవన్‌లో దీప యజ్ఞంలో కేసీఆర్ పాల్గొననున్నారు. కేసీఆర్‌తో పాటు కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.