ఈ పరిస్థితిని తాను ముందే ఊహించానంటున్న శాస్త్రి

వాస్తవం ప్రతినిధి: కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రపంచం స్తంభించిపోయింది. చాలా దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. దేశ సరిహద్దులే కాదు.. రాష్ట్రాలు.. గ్రామాల మధ్య సరిహద్దులు కూడా మూతపడ్డాయి. ఈ మహమ్మారి దెబ్బకు క్రీడారంగం కుదేలవగా క్రికెట్ పూర్తిగా ఆగిపోయింది. అయితే, ఈ పరిస్థితిని తాము ముందే ఊహించామని భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి తెలిపాడు.

ప్రపంచ వ్యాప్తంగా క్రీడలు స్తంభించిపోయే అవకాశం ఉందని దక్షిణాఫ్రికా, భారత్ మధ్య వన్డే సిరీస్‌ రద్దయిన సమయంలోనే భారత క్రికెటర్లకు తెలుసన్నాడు. ఈ సిరీస్‌ కంటే ముందు టీమిండియా.. న్యూజిలాండ్‌లో పర్యటించింది. అయితే, భారత్‌లో కరోనా వ్యాప్తి మొదలైన సమయంలోనే మన క్రికెటర్లు స్వదేశానికి వచ్చారని శాస్త్రి చెప్పాడు.