లాక్ డౌన్ నేపథ్యంలో ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం…!!

వాస్తవం ప్రతినిధి: కరోనా వైరస్ ప్రభావం ప్రపంచంలో ఉన్న కొద్ది ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 21 రోజులపాటు లాక్‌డౌన్ ప్రకటించింది. దేశంలో ఉన్న ప్రజలంతా ఇంటికే పరిమితం కావాలని ప్రధాని పిలుపు ఇవ్వటం జరిగింది. దీంతో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇటువంటి లాక్ డౌన్ నేపథ్యంలో ఏపీ హైకోర్టు బెంచ్ సంచలన నిర్ణయం తీసుకుంది.

విషయంలోకి వెళ్తే కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు హైకోర్ట్ కింద పనిచేసే అన్ని కోర్టులు, ట్రిబ్యునల్స్, లీగల్ సెల్ అథారిటీ, మీడియేషన్, ఆర్బిట్రేషన్ సెంటర్లు, హైకోర్ట్ లీగల్ సర్వీస్ కమిటీలు పనిచేయవని హైకోర్ట్ బెంచ్ తెలిపింది. లాక్‌డౌన్ పూర్తయ్యే వరకు వీటి కార్యకలాపాలు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.