లాక్ డౌన్ సమయంలో తెలంగాణ వాళ్ళు బయట కనబడితే అవుట్, వాళ్లను దింపిన కేసీఆర్..!!

వాస్తవం ప్రతినిధి: కరోనా వైరస్ నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు షట్ డౌన్ ప్రకటించింది. వైరస్ దేశంలో విస్తరించకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వస్తున్నాయి. కరోనా వైరస్ విషయంలో అభివృద్ధి చెందిన దేశాలు చేతులు ఎత్తి వేస్తుంటే భారత్ మాత్రం బాగా యుద్ధం చేస్తోంది అంటూ, గెలవాలని అంతర్జాతీయ స్థాయిలో ఉన్న నాయకులు కోరుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ సమయంలో రోడ్లపైకి వచ్చి ఇష్టానుసారంగా తిరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ కేంద్ర బలగాలను రంగంలోకి దింపారు. లాక్ డౌన్ సమయంలో తెలంగాణ వాళ్ళు ఎక్కడ కనబడితే అక్కడ వాళ్ళని గట్టిగా కట్టడి చేయడానికి కేంద్ర బలగాలను కెసిఆర్ కేంద్ర ప్రభుత్వ సాయంతో రంగంలోకి దింపినట్లు సమాచారం. చాలా వరకు తెలంగాణ రాష్ట్రంలో కర్ఫ్యూ టైంలో ఇష్టానుసారంగా ప్రజలు వ్యవహరించడంతో…పాజిటివ్ కేసులు ఉన్న కొద్దీ నమోదవుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.