దేశవ్యాప్తంగా 523మందికి కరోనా పాజిటివ్

వాస్తవం ప్రతినిధి: కరోనా మహమ్మారి దేశంలో కోరలు చాస్తోంది .కరోనా వైరస్ మహమ్మారి భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి 21 రోజుల పాటు అనగా ఏప్రిల్ 14 అర్ధరాత్రి వరకు దేశం మొత్తం లాక్‌డౌన్ ప్రకటించారు.

బుధవారం నాటికి దేశంలో 523 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. తమిళనాడులో వ్యక్తి మృతితో మృతుల సంఖ్య దేశంలో 11కి చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. కర్ణాటకలో ఒక్కరోజే 10 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.