శ్రీకాళహస్తి లో తొలి కరోనా పాజిటివ్‌ కేసు

వాస్తవం ప్రతినిధి:  .కరోనా మహమ్మారి దేశంలో కోరలు చాస్తోంది చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. గోపాలవనంలో లండన్‌ నుంచి వచ్చిన విద్యార్థికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు.

ఈ నెల 19న లండన్‌ నుంచి శ్రీకాళహస్తికి చేరుకున్న 25 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. కరోనా బాధితుడు నివాసం ఉంటున్న చోటు నుంచి 3 కిలోమీటర్ల వరకు అనుమతి ఇవ్వరాదని కలెక్టర్‌ ఆదేశించారు. కరోనా కేసు నమోదు కావడంతో శ్రీకాళహస్తి ప్రజలు ఉలిక్కిపడ్డారు.

ఏపీలో ప్రస్తుతం కరోనా 2వ స్టేజీలో ఉంది. వైజాగ్ లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఏపీలో బుధవారం తిరుపతిలో కేసుతో సంఖ్య 8కి చేరింది. మొత్తం 15వేల మంది విదేశాల నుంచి తిరిగివచ్చారు. వారిని గుర్తించి పరీక్షించే పనిలో అధికారులున్నారు.మొత్తం రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేసి నిర్బంధం విధించారు. సరిహద్దులు మూసివేశారు.