దయచేసి ప్రభుత్వాల అభ్యర్థనను అర్థం చేసుకుని ఆచరించండి: విజయశాంతి

వాస్తవం ప్రతినిధి: కరోనా వ్యాప్తిపై లేడీ అమితాబ్ విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుందని, పరిస్థితి రోజుకు రోజుకు ఆందోళనకరంగా మారుతుందని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. తన అధికారిక ఫేస్‌బుక్‌లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు విజాయశాంతి.

ప్రభుత్వాలు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు లాక్ డౌన్ గురించి హెచ్చరిక స్వరంతో చేసిన విజ్ఞప్తిని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. లాక్ డౌన్‌కు, కర్ఫ్యూకు నిర్ణయ వ్యత్యాసం మన ప్రజలపైనే ఆధారపడి నిర్దేశితమవుతుంది. దేశాన్ని మరింత సంక్లిష్టతకు గురి చెయ్యవద్దు. మన వైద్య విభాగ పరిస్థితి, పరిమాణాల ప్రామాణికత, అంతర్జాతీయ స్థాయిలో లేదని గుర్తించండి. ప్రభుత్వాల అభ్యర్థనను అర్థం చేసుకుని ఆచరించండి. నా వంతుగా మీకు అవగాహన కల్పించేందుకు గత కొన్ని రోజులుగా నేను చేస్తున్న ఈ ప్రయత్నం ప్రజలకు మేలు చెయ్యాలని కోరుకుంటూ…మీ విజయశాంతి అంటూ కొచ్చారు.