అక్కడ ఖాత తెరిచిన కరోనా.. తొలి పాజిటివ్ కేసు..!!

వాస్తవం ప్రతినిధి: ప్ర‌పంచ దేశాలు క‌రోనాతో గ‌డ‌గ‌డ‌లాడుతున్నాయి. ఎంతో మంది జ‌నం పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. వేలాది కుటుంబాలు రోడ్డున‌ప‌డుతున్నాయి. కోవిడ్ వైర‌స్ గురించి వింటేనే గుండెగుబేల్ మంటుంది. ఇప్ప‌టికే దాదాపుగా అన్ని దేశాల‌కు విస్త‌రించిన క‌రోనా వైర‌స్ తాజాగా మ‌య‌న్మార్‌కు విస్త‌రించింది. ఈ దేశంలో మొద‌టి పాజిటివ్ కేసు నిర్ధార‌ణ అయింది. ఇదే విష‌యాన్ని మ‌య‌న్మార్ అధికారికంగా ప్ర‌క‌టించింది. అమెరికా నుంచి వ‌చ్చిన 36 ఏండ్ల యువ‌కుడికి క‌రోనా పాజిటివ్ వచ్చిన‌ట్లు తెలిపింది. కాగా చైనాతో స‌రిహ‌ద్దును క‌లిగి ఉన్న మ‌య‌న్మార్‌లో ఇదే మొద‌టి కేసు కావ‌డం గ‌మ‌నార్హం