అసలు.. ఈ హంటా వైరస్ అంటే ఏమిటో తెలుసా..??

వాస్తవం ప్రతినిధి: ఇప్పటికే ప్రపంచం కరోనా వైరస్‌తో యుద్ధం చేస్తోంది. ఈ వైరస్ బారినపడి వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. లక్షలాది మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. ముఖ్యంగా, చైనాలోని వుహాన్‌లో పురుడుపోసుకున్న ఈ వైరస్.. ఇపుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. కాగా తాజాగా చైనాలో హంటా వైరస్‌ వెలుగు చూసింది. హంటా వైరస్ ప్రధానంగా ఎలుకల నుంచి సంక్రమిస్తుందని ది సెంటర్ ఫర్ డిసిజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) చెబుతోంది. చాలా మంది హంటా వైరస్ అంటే కొత్తగా సంక్రమించిన వైరస్ అని అనుకుంటున్నారు. 1978లో దక్షిణ కొరియాలోని హంటాన్ నది సమీపంలో ఎలుకల వల్ల ఈ వైరస్ పుట్టడంతో దీనికి హంటాన్ వైరస్ అనే పేరు వచ్చింది. కొరియన్ యుద్దం తరువాత ఐక్యరాజ్యసమితి దళాలలో 3 వేల మందిలో కొరియన్ హెమరాజిక్ ఫీవర్ నమోదైంది. ఆ తర్వాత 1981లో హంటా వైరస్ అనే మరో జాతి తెరపైకి వచ్చింది. ఈ వైరస్‌‌లో హెమరాలిజిక్ ఫీవర్ విత్ రెనాల్ సిండ్రోమ్‌ లక్షణంగా కనపడుతుంది. చైనాలో ఎలుకల్ని తినడం సర్వసాధారణమే. అలా ఎలుకల్ని తినేవారిలోకి ఈ వైరస్‌ ప్రవేశిస్తుంది. ఇప్పటికే పలువురు హంటా వైరస్‌ బారిన పడినట్లు తెలుస్తోంది. బతికి వున్న ఎలుకల్ని సాస్‌లో ముంచుకుని, మద్యం సేవిస్తూ తినడం చైనాలో ఓ సరదా అలవాటుగా మారిపోయింది. అలవాటు కాదు, అదొక వ్యసనం అంటున్నారు చాలామంది. చైనా ప్రజలు జంతువులను సజీవంగా తినడం ఆపకపోతే ఇది కొనసాగుతుందని సోషల్ మీడియాలో నెటిజన్లు, ప్రజలు మండిపడుతున్నారు.