రష్యా దేశం లో భారీ భూకంపం సునామీ వచ్చే అవకాశాలు..!!

వాస్తవం ప్రతినిధి: ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో అతలాకుతలం అవుతోంది. చాలా దేశాలలో ఈ వైరస్ చాలా స్పీడ్ గా వ్యాప్తి చెందుతోంది. యూరప్ మరియు అమెరికా దేశాలలో చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతున్న ఈ వైరస్ వల్ల చాలామంది ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే రష్యాలో మాత్రం ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా చాలా కంట్రోల్ చేస్తూ కట్టుదిట్టమైన స్ట్రిక్ట్ రూల్స్ దేశంలో అమలు చేస్తున్నారు. ప్రపంచంలో ఉన్న దేశాలలో చాలా కేసులు నమోదు అవుతుంటే రష్యాలో మాత్రం అతి తక్కువ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. ముఖ్యంగా 15 రోజులు ఇంట్లో ఉంటారా లేదంటే బయటకు వచ్చి ఐదేళ్లు జైల్లో ఉంటారా అనే నిబంధనను అమలు చేయడంతో రష్యా ప్రజలు భయపడి ఇళ్లకే పరిమితం అవుతున్నారు.ఇదిలా ఉంటె, ఇటీవల రష్యాను భూకంపం వణికించింది. రష్యాకు చెందిన కురిల్ ఐలాండ్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.5 గా నమోదైన ఈ భూకంపం వలన ఎంతటి ఆస్తినష్టం వచ్చింది. ఎంత ప్రాణనష్టం జరిగింది అనే విషయాలు తెలియాల్సి ఉన్నది. అయితే, కురిల్ ఐలాండ్ కు 138 మైళ్ళ దూరంలో భూకంప కేంద్రం ఉన్నది. దీంతో ఆ ప్రాంతంలో సునామి హెచ్చరికలను జారీ చేశారు. దీంతో ఇళ్లలో ఉన్న రష్యా ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.