కొంప ముంచాడురోయ్.. చైనాలో మరో కొత్త వైరస్..!!

వాస్తవం ప్రతినిధి: కరోనా(కొవిడ్-19) వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తోంది. సూక్ష్మజీవి కొవిడ్-19(కరోనా)ను నియంత్రించేందుకు ఏ దేశానికాదేశం పకడ్బందీ చర్యలను చేపడుతున్నాయి. ప్రపంచం మొత్తం కొవిడ్-19 వ్యాక్యిన్ కోసం అష్టకష్టాలు పడుతోంటే చైనాలో తాజాగా మరో వైరస్ తెరమీదకు వచ్చి భయపెడుతోంది. అదే హంటా వైరస్. హంటా వైరస్ ప్రధానంగా ఎలుకల నుంచి సంక్రమిస్తుందని ది సెంటర్ ఫర్ డిసిజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) చెబుతోంది. హంటా వైరస్‌తో చైనాలో ఒక వ్యక్తి మరణించినట్టు చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ తాజాగా వెల్లడించింది. గ్లోబల్‌ టైమ్స్‌ ప్రకారం.. ఓ వ్యక్తికి హంటా వైరస్‌ లక్షణాలు బయటపడటంతో నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. అతనికి హంటా వైరస్‌ పాజిటివ్‌గా సోమవారం నిర్ధారణ అయింది. అయితే, అతడు పని నిమిత్తం షాండాంగ్‌ ప్రావిన్స్‌కు చార్టర్డ్‌ బస్సులో పయమవ్వగా దారిలోనే ప్రాణాలు విడిచాడు. ఇది ఇలా ఉండగా.. ఇంకో షాకింగ్‌ విషయమేంటంటే.. మరో 32 మంది కూడా ఇదే వైరస్‌ బారిన పడినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, అయితే, వారి రిపోర్టులు రావాల్సి ఉంది. కాగా, సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఈ వార్త ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది.