అయ్యో..ధావన్‌కు ఎంత కష్టమొచ్చే..?

వాస్తవం ప్రతినిధి: టీమిండియా సీనియర్ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ కూడా కూడా కరోనా సెలవులను బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ధావన్‌ ఓ వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్‌ చేశారు. దీనిలో ఎక్కువ రోజులు ఇంట్లో ఉంటే భర్త ఎదుర్కొనే పరిస్థితులను సరదాగా చూపిస్తూ వీడియోను చిత్రీకరించి పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ధావన్‌ బట్టలు ఉతుకుతుండగా.. తన భార్య ఆయేషా ముఖర్జీ మేకప్‌ వేసుకున్నారు. ఆ తర్వాత ఆయేషా ఫోన్‌ మాట్లాడుతూ కర్ర పట్టుకొని ధావన్‌తో బలవంతంగా టాయిలెట్‌ కడిగించింది.

ప్రస్తుతం ఈ సరదా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్లు కురిపిస్తున్నారు. అయ్యో ధావన్‌కు ఎంత కష్టమొచ్చే అని ఓ అభిమాని ట్వీట్ చేయగా.. కరోనా సెలవులను ధావన్ ఎంజాయ్ చేస్తున్నాడు అని మరో అభిమాని కామెంట్ చేసాడు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇంటికే పరిమితమైన ప్రతి భర్త పరిస్థితి ఇలాగే ఉందని నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ఇక భారత టెన్నిస్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ కూడా నవ్వుతున్న ఎమోజీలను కామెంట్‌ చేసింది.