చరిత్రలో ఇలా జరగడం ఇది నాలుగో సారి..!!

వాస్తవం ప్రతినిధి: కరోనా మహమ్మారి దెబ్బకు జూలై 24 నుంచి జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌ను వాయిదా వేస్తున్నట్టు అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ (ఐఓసీ) ప్రకటించింది. వచ్చే ఏడాది వేసవి తర్వాత వీటిని నిర్వహించే అవకాశం ఉంది. కాగా, 124 ఏళ్ల ఒలింపిక్ క్రీడల చరిత్రలో ఇలా జరగడం ఇది నాలుగో సారి. 1916లో బెర్లిన్, జర్మన్ ఎంపైర్‌లో ఒలింపిక్స్ జరగాల్సి ఉండగా మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా క్రీడలను తొలిసారి రద్దు చేశారు. ఆ తర్వాత 1940లో జపాన్ సమ్మర్, వింటర్ ఒలింపిక్స్ నిర్వహించాలని నిర్ణయించింది. అయితే అప్పట్లో రెండో ప్రపంచ యుద్ధం కారణంగా రద్దు చేశారు వేశారు. 1944లో లండన్‌లో జరగాల్సిన క్రీడలను కూడా రెండో ప్రపంచ యుద్ధమే అడ్డుకుంది. తాజాగా, ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా ఒలింపిక్స్ వాయిదా పడింది.