‘అసురన్’ కన్నడ రీమేక్‌లో కన్నడ స్టార్ హీరో

వాస్తవం ప్రతినిధి: ధ‌నుష్ క‌థానాయ‌కుడిగా వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ‘అసుర‌న్’ చిత్రం త‌మిళనాట భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 100కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. చ‌క్క‌టి సామాజిక సందేశంతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకొంది. ఈ చిత్రాన్ని క‌న్న‌డంలో కూడా రీమేక్ చేయ‌బోతున్నారు. ఇందులో క‌న్న‌డ అగ్ర న‌టుడు శివ‌రాజ్‌కుమార్ హీరోగా న‌టించ‌బోతున్నారు. జాక‌బ్ వ‌ర్గీస్ ద‌ర్శ‌కుడు. త‌మిళ మాతృక‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన వెట్రిమార‌న్ క‌న్న‌డ వెర్ష‌న్ నిర్మాణ బాధ్య‌త‌ల్ని తీసుకున్నారు. ప్ర‌ఖ్యాత త‌మిళ న‌వ‌ల ‘వెక్కై’ ఆధారంగా రూపొందిన ‘అసుర‌న్’ చిత్రంలో కుల వివ‌క్ష‌ను చ‌ర్చించారు. భూస్వామ‌లు చేతిలో బ‌లైపోయిన కొడుకు హ‌త్య‌కు ప్ర‌తీకారంగా తండ్రి ఏం చేశాడ‌న్న‌దే అసుర‌న్ చిత్ర క‌థాంశం.