ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠ అందరిలో..!!

వాస్తవం సినిమా: ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కుతోంది. కరోనా వైరస్ వల్ల ప్రస్తుతం అన్ని షూటింగులు ఆగిపోవడంతో ఈ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అయితే సినిమా షూటింగ్ మొదలు పెట్టి ఏడాది అవుతున్న గాని ఈ సినిమాకి సంబంధించి ఒక అప్ డేట్ కూడా బయటకు రాకపోవడంతో ఫ్యాన్స్ ఫుల్ సీరియస్ గా మొన్నటివరకు ఉన్నారు. ఇటువంటి తరుణంలో ఎట్టకేలకు ఈ సినిమాకు సంబంధించి ఉగాది పండుగ నాడు మోషన్ పోస్టర్ రిలీజ్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో నందమూరి మరియు మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని మోషన్ పోస్టర్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అందరిలో ఇదే ఉత్కంఠ నెలకొని ఉంది. రాజమౌళి సినిమా అయిన నేపథ్యంలో…పైగా బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కావడంతో, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ పెద్ద హాట్ టాపిక్ అయింది.