రవితేజ తో పూరి జగన్నాథ్..!!

వాస్తవం సినిమా: టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వరుస ఫ్లాపుల్లో ఉన్న సమయంలో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తో అదిరిపోయే విజయాన్ని సాధించారు. గత ఏడాది జూలై 18 వ తారీకు న విడుదలైన ఈ సినిమా పూరి జగన్నాథ్ కెరీర్లోనే అత్యంత లాభాలను తెచ్చిపెట్టిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఇదే తరుణంలో వరస ఫ్లాపుల్లో ఉన్న రామ్ కి లైఫ్ ఇచ్చిన సినిమాగా ‘ఇస్మార్ట్ శంకర్’ రూపుదిద్దుకొంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఇదే టైమ్ లో ప్రస్తుతం పూరిజగన్నాథ్ రవితేజతో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే స్టోరీ కూడా వినిపించినట్లు అంతా రెడీ అయినట్లు ఈ సినిమాకి కూడా పూరి జగన్నాథ్ మరోపక్క నిర్మాత గా వ్యవహరించనున్నట్లు సమాచారం.