ఉగాది పండుగ నాడు ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి..!!

వాస్తవం సినిమా: ఉగాది పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగు ప్రజల పండుగ ఉగాది పర్వదినాన మెగా అభిమానులు అందరికీ ట్విట్టర్ ద్వారా ట్రీట్ ఇవ్వటానికి చిరంజీవి రెడీ అయ్యారు. ఈ సందర్భంగా ఒక యాడ్ రూపంలో చిరంజీవి తన అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నట్లు వీడియో రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఉగాది పండుగ నాడు ఉదయం 11:11 గంటలకు మెగాస్టార్ కె.చిరు ట్వీట్స్ అనే అకౌంట్ ద్వారా అభిమానులకు చేరుకున్నారు. దీనికి అతి తక్కువ టైమ్ లోనే చాలా మంది మెగా అభిమానులు ఆయన్ని ఫాలో అవుతున్నారు. రాజకీయాల నుండి సినిమారంగంలో అడుగుపెట్టిన తర్వాత వరుసగా రెండు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించిన చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉండటంతో సినిమా షూటింగ్ వాయిదా పడింది.