సీఎం రిలీఫ్ ఫండ్‌కు తనవంతు సాయం ప్రకటించిన చంద్రబాబు

 వాస్తవం ప్రతినిధి: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రభుత్వాలు కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఇలాంటి కష్టకాలంలో సినిమా సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. మేమున్నామంటూ ముందుకొస్తున్నారు. వారికి తోచిన సాయాన్ని అందిస్తున్నారు. ఏపీలో కూడా కొందరు రాజకీయ నేతలు ముందుకు వచ్చారు. తమ సాయాన్ని ప్రకటించారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.10 లక్షలు ప్రకటించారు టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. టీడీఎల్పీ సభ్యులతో ఆన్‌లైన్ సమావేశంలో పాల్గొన్న ఆయన కరోనా ప్రబలుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాధి నిరోధకానికి, బాధితుల సహాయానికి ఈ మొత్తం వినియోగించాలన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అందరూ తమ వంతుగా ప్రభుత్వాలకు సహకరించాలన్నారు చంద్రబాబు.