దేశ ప్రజలకు ‘ఉగాది’శుభాకాంక్షలు ..తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని

వాస్తవం ప్రతినిధి: నేడు నూతన సంవత్సరాది పర్వదినం ‘ఉగాది’ తెలుగు రాష్ట్రాల్లో నిరాడంబరంగా జరుగుతున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన తెలుగులో ట్వీట్ చేయడం గమనార్హం.

“ఉగాదితో కొత్త సంవత్సరం ఆరంభం అవుతోంది. ఈ సంవత్సరం ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చి, కష్టాలను అధిగమించే నూతనశక్తిని ప్రసాదిస్తుందని ఆశిస్తున్నాను. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ముఖ్యంగా ఆరోగ్యంతో వుండాలని ప్రార్ధిస్తున్నాను” అని ఆయన ట్వీట్ చేశారు. అలాగే వివిధ భాషల్లో ప్రజలకు ట్విట్టర్ వేదికగా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.