ఇండియాలో లాక్ డౌన్ పాటించకపోతే ఏడాదిపాటు కటకటాల కే..!!

వాస్తవం ప్రతినిధి: ప్రధాని మోడీ పిలుపుమేరకు ఇండియా మొత్తం ప్రస్తుతం లాక్ డౌన్ అయ్యింది. 21 రోజులపాటు ఈ నిబంధన దేశంలో అమలు కానున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. లాక్ డౌన్ టైం లో దేశ ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలని గట్టిగా ఆదేశించారు. ఇక కేంద్ర హోం శాఖ కూడా కొన్ని కీలకమైన హెచ్చరికలను, ఆదేశాలను జారీ చేసింది. ఎవరైనా సరే లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే సరైన కారణం చెప్పకుండా బయటకు వస్తే విపత్తుల నిర్వహణ చట్టం సెక్షన్ 51 కింద ఏడాదిపాటు కటకటాల కే జైలు శిక్ష విధిస్తామని అంటున్నారు. కాబట్టి దేశ ప్రజలు ఎవరూ కూడా బయటకు రాకూడదు అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు రాకూడదు అని ప్రభుత్వం సూచించిన విధంగా ప్రజలు నడుచుకోవాలని…నిత్యావసరాల వస్తువుల కోసం బయటకు రావాలని ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా వైరస్ వ్యాప్తి చేసే చర్యలకు పాల్పడితే రెండు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధిస్తామని ప్రజలు నిబంధనలు రూల్స్ పాటించాల్సిందే అంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేయడం జరిగింది.