దేశవ్యాప్తంగా 21 రోజులపాటు రైళ్ళు బంద్..!!

వాస్తవం ప్రతినిధి: దేశ ప్రధాని మోడీ ఏప్రిల్ 14 వరకు అనగా 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధన పాటించాలని కోరడం జరిగింది. దేశ ప్రధానిగా కాకుండా కుటుంబ సభ్యుడిగా విజ్ఞప్తి చేస్తున్నట్లు మోడీ పేర్కొన్నారు. వైరస్ ని అరికట్టాలంటే ఈ ఒక్క మార్గం తప్ప మరొక మార్గం లేదని మోడీ పిలుపునిచ్చారు. కచ్చితంగా దేశ ప్రజలందరూ సహకరించాలని కోరారు. దీంతో 21 రోజులపాటు దేశవ్యాప్తంగా ఉన్న రైళ్ళు బంద్ అయిపోయాయి. అన్ని ప్యాసింజర్ రైళ్లూ సర్వీసుల నిలిపివేత వచ్చే నెల 14వ తేదీ వరకు ఉంటుందని భారతీయ రైల్వే ప్రకటించింది. 21 రోజుల లాక్‌డౌన్‌ నేపథ్యంలో రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. అయితే నిత్యావసరాలను అందుబాటులో ఉంచాల్సి ఉన్నందున సరుకుల రవాణా రైళ్లు యథావిధిగా నడుస్తాయని అధికారులు చెప్పారు. మరోపక్క ఎప్పుడో విమాన సర్వీసులను కూడా నిలిపివేయడంతో ప్రస్తుతం దేశంలో రవాణా వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది.