తొలిసారి కళ తప్పిన తెలుగువారి పండుగ

వాస్తవం ప్రతినిధి: ప్రస్తుతం దేశంలో కరోనా కారణంగా లాక్ డౌన్ ప్రకటించారు.అందరినీ ఇళ్లలోనే ఉండమంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఎవరి ఇంట్లో వారున్నారు.మార్కెట్లు అన్నీ బోసిపోయాయి. ఉగాదికి సంబంధించిన మామిడికాయలు వేపపువ్వు చింతపండు ఇతర సామగ్రి కొనుగోళ్లే లేకుండా పోయాయి. పట్టణాల్లో అయితే మరీ ఘోరం.. గ్రామాల్లో కాస్తంతా వెసులుబాటు ఉండి చెట్లకు ఆకులు పండ్లు తెంపుకొని ఈ పండుగ చేసుకుంటున్నారు.

ఉగాది ఉన్నా కరోనా భయంతో ఇప్పుడు ఎవరూ ఇళ్లు విడిచి బయటకు రావడం లేదు. దీంతో తెలుగువారి పండుగ కళతప్పింది. కరోనా వైరస్ వల్ల పండుగనే లేకుండా పోయింది. వస్తువులు పదార్థాలు కొనే వీలు లేకుండా పోతుండడంతో ఎక్కడివాల్లు అక్కడే ఇంట్లోనే ఉంటున్నారు.

ప్రస్తుతం కరోనా నుంచి బయటపడేందుకే జనం యోచిస్తున్నారు. ఆ భయంలోనే బతుకుతున్న పరిస్థితి నెలకొంది. అంతేతప్ప ఉగాది వచ్చిందని పండుగ చేసుకునే మూడ్ లో లేరు. సో తొలిసారి తెలుగు వారి పండుగ ఉగాది కళతప్పింది.