మరోసారి రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే జరపండి: సీ ఎం జగన్ ఆదేశాలు

వాస్తవం ప్రతినిధి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా నివారణపై సీఎం జగన్‌ అధికారులతో సమీక్షిస్తున్నారు. సమీక్ష సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్లనాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, వైద్య ఆరోగ్యశాఖ, పోలీస్‌ శాఖ అధికారులు హాజరయ్యారు.

ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా మరోసారి సమగ్ర సర్వే నిర్వహించాలని ఆదేశించారు ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి. . ఇప్పటివరకూ విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చినవారు, వారిని కలిసిన వారిపైనే కాకుండా ప్రజలందరిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మంగళవారం రాత్రి తన నివాసంలో రాష్ట్రంలో లాక్ డౌన్ అమలవుతున్న తీరు, కరోనా వైరస్ వ్యాప్తిపై ఉన్న‌త స్థాయి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..వైరస్ వ్యాప్తిని నియంత్రించ‌డానికి మరోసారి గ్రామ, వార్డు వలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లతో సర్వే చేయించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటిని సర్వే చేయాలని, కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నవారు ఎవరైనా ఉంటే.. సత్వరమే వైద్య సహాయం అందించాలన్నారు.