కరోనా కి ప్రపంచం మొత్తం హడలిపోతుండగా.. వారికి మాత్రం వరంలా మారింది

వాస్తవం ప్రతినిధి:కరోనా వైరస్‌ కు ప్రపంచం మొత్తం హడలిపోతుండగా.. జైళ్లలోని ఖైదీలు మాత్రం ఆనంద తాండవం చేస్తున్నారు.ఈ వ్యాధి కొందరు ఖైదీలకు వరంలా మారింది. ఏళ్లతరబడి జైల్లో మగ్గుతున్న వీరికి స్వేచ్ఛ దొరికినట్లయింది. జైళ్లలోని విచారణ ఖైదీలను జామీనుపై విడుదల చేయాలని అన్ని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశిస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో కరోనావైరస్ వ్యాప్తి భారతదేశం అంతటా వ్యాపించడంతో, వచ్చే 3-4 రోజుల్లో 3000 మంది ఖైదీలను విడుదల చేయాలని తీహార్ సెంట్రల్ జైలు నిర్ణయించినట్లు తీహార్ జైలు పరిపాలన మీడియాకు తెలిపింది. అంతేకాదు చెన్నై లో కూడా మరో మూడు వేలమంది ఖైదీలు విడుదల కానున్నారు.