షడ్రుచుల ఉగాది అందరికీ ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలిగించాలి: సీ ఎం జగన్

వాస్తవం ప్రతినిధి: నేడు నూతన సంవత్సరాది పర్వదినం ‘ఉగాది’ తెలుగు రాష్ట్రాల్లో నిరాడంబరంగా జరుగుతున్న సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏడాది కూడా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ప్రతి ఇల్లు సుఖసంతోషాలతో కళకళలాడాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. షడ్రుచుల ఉగాది అందరికీ ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలిగించాలని అభిలషిస్తున్నట్టు వెల్లడించారు. అయితే కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని సామూహిక వేడుకలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కరోనాను అరికట్టేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కొన్నాళ్ల పాటు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు.