కరోనా ఎఫెక్ట్.. మోదీ కీలక నిర్ణయం !

వాస్తవం ప్రతినిధి: అందరూ ముందుగా ఊహించిహనట్టుగానే లాక్ డౌన్ ను ఏప్రిల్ 15 వరకు పొడిగించారు ప్రధాని నరేంద్రమోడీ. బుధవారం జాతినుద్దేశించి ప్రసంగించిన మోడీ..ఇప్పటి నుంచి 21 రోజులు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉంటుందని స్పష్టం చేశారు. కరోనా కట్టడిపై నిపుణుల తో సమాలోచనలు జరిపామని.. కరోనాకు చెక్ పెట్టేందుకు 21డెస్ కావాలని చెప్పినట్లు మోడీ తెలిపారు. ప్రజలంతా ఒక్కటే పని చేయాలని…ఇంటికి పరిమితం అవ్వాలని సూచించారు. ఈ 20 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని…ఆ తరువాత పరిస్థితుల్లో మార్పు వస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

లాక్ డౌన్ పై మరింత అవగాహన కల్పిస్తూ మోడీ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ ఒకరంగా మనదేశానికి లక్ష్మణ రేఖ లాంటిదని వ్యాఖ్యానించారు. ఈ 20 రోజులు మనం జాగ్రత్తలు తీసుకోకపోతే తరువాత పరిస్థితి చేయి దాటిపోతుందని ఆ తరువాత ఎం చేసిన ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. కొద్దిరోజులు ఇంటి నుంచి బయటకు వెళ్లాలనే ఆలోచన పెట్టుకోవద్దని ప్రజల్ని కోరారు ప్రధాని మోదీ. లాక్ డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో ఇల్లు వదిలి బయటకు రావడం నిషేధమని చెప్పారు. నేటి అర్ధరాత్రి నుంచి జనతా కర్ఫ్యూను మించి నిషేధాజ్ఞలు అమలు చేస్తామని వివరించారు. ఎవరైనా బయటకు వస్తే కేసులు పెడతామని తెలిపారు.