దయచేసి లాక్ డౌన్ ని విధిగా పాటించండి: పవన్ కల్యాణ్‌

వాస్తవం ప్రతినిధి: దేశంలోని చాలా మంది ఇప్పటికీ లాక్‌డౌన్‌ను తీవ్రంగా పరిగణించట్లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ పాటించి మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు కుటుంబాన్ని రక్షించుకోవాలని, లాక్‌డౌన్ నియమాలు పాటించాలని ఆయన చేసిన ట్వీట్‌ను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ రీట్వీట్ చేశారు.

‘ప్రధాని మాట పాటిద్దాం, కరోనా విముక్త భారతాన్ని సాధిద్దాం… మనల్ని మనం రక్షించుకుందాం. దయచేసి అందరు కరోనా వ్యాధి తీవ్రతని గుర్తించాలి. లాక్ డౌన్ ని విధిగా పాటించాలి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలందరి చేత పాటించేలా చర్యలు తీసుకోవాలి’ అని పవన్ కల్యాణ్ కోరారు.