జనతా కర్ఫ్యూ ఐడియా ప్రధానికిచ్చింది.. నేనే..??

వాస్తవం ప్రతినిధి: ఎప్పుడు ట్వీటర్ లో యాక్టివ్ గా ఉంటూ.. ఏదో ఒక్కటి పోస్ట్ చేస్తూ.. టీడీపీని టార్గెట్ చేస్తూ ఉండే వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి తాజాగా చంద్రబాబు నాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్వీటర్ వేదికగా రెచ్చిపోయారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు అత్యంత బాధ్యతతో వ్యవహరిస్తూ ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా.. ఎల్లో మీడియాలో వస్తున్న వార్తలపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ” పవర్ పోయిన దిగులులో ఉన్నాడు కానీ లేకపోతే జనతా కర్ఫ్యూ ఐడియా ప్రధానికిచ్చింది తనేనని బొంకేవాడు. చైనా ప్రెసిడెండ్‌కు ధైర్యం చెప్పిన బాబు అంటూ ఎల్లో మీడియా రోజంతా దంచేది. వీడియో కాన్ఫరెన్సులతో అధికారులను ఏడిపించేవాడు. నిధులు నాకేందుకు రకరకాల స్కీమ్స్ మొదలయ్యేవి’ అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.