మీడియాను అడ్డం పెట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తొంది..!!

వాస్తవం ప్రతినిధి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా కారణంగా రాష్ట్ర ఎన్నికల కమీషన్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే, కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు అత్యంత బాధ్యతతో వ్యవహరిస్తూ ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా.. ఎల్లో మీడియాలో వస్తున్న వార్తలపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ఆయన ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. “కరోనా వైరస్ నిర్మూలనతో పాటు ఎల్లో వైరస్ వ్యాప్తిని కూడా నియంత్రించాలి. ఎల్లో మీడియా ‘తుమ్ములు, దగ్గులతో’ పచ్చ వైరస్ ను వదులుతూనే ఉంది. అధికార పీఠం నుంచి తరిమివేసినా చంద్రబాబు బ్యాచ్ తమ మీడియాను అడ్డం పెట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తోంది. తస్మాత్ జాగ్రత్త!” అంటూ ఘాటు ట్వీట్ చేశారు.